అయోధ్య లో స్టార్ హీరోయిన్.. భర్తకి కాషాయం కప్పింది!
on Mar 21, 2024
బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ప్రియాంక చోప్రా రేంజ్ మాత్రం వేరు. తక్కువ వ్యవధిలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన రికార్డు ఆమె సొంతం. హాలీవుడ్ లో కూడా నటించి అక్కడి నటుడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల ఇండియా వచ్చిన ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ప్రియాంక తన హస్బెండ్ నిక్ జోన్స్ ,కూతురు మల్టి మారి తో కలిసి అయోధ్య రాముడ్ని దర్శించుకుంది.హిందూ సాంప్రదాయ పద్దతిలో పూర్తి ట్రెడిషనల్ లుక్ తో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఆలయ అధికారులు కూడా ఆమెకి స్వాగతం పలికారు. జోన్స్ అండ్ మారి కూడా పూర్తి ట్రెడిషనల్ లుక్ తోనే వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి.వాటిని చూసిన చాలా మంది ప్రియాంక అమెరికా లో ఉన్నా కూడా మన సంసృతిని మాత్రం మర్చిపోలేదని ప్రశంసిస్తున్నారు. ఇటీవల ముంబై లో జరిగిన అంబానీ కొడుకు పెళ్లి కి హాజరయిన సందర్భంలోను ప్రియాంక వార్తల్లో నిలిచింది.
ఇక ఆమె భర్త జోన్స్ అమెరికాలో పేరెన్నిక గన్న నటుడు.2018 లో వారివురి వివాహం జరిగింది. అమెరికాలోనే నివాసం ఉంటున్న ప్రియాంక 65 చిత్రాలకి పైగానే నటించింది. ఫ్యాషన్, బర్ఫీ, baajerav మస్తానీ ,మారి కోమ్, ది స్కై ఈజ్ పింక్ , కామిని, ఐతరాజ్, డాన్ ,ఫ్రెండ్ షిప్, క్రిష్ లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Also Read